పేదరిక నిర్మూలనే ధ్యేయం
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:30 AM
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగి స్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్
గజపతినగరం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగి స్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదు పాడ గ్రామంలో రూ.57.30లక్షలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అలాగే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యను తెలుసుకు న్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ చేసిన అప్పులకు రాష్ట్రం 30 ఏళ్లు వెనుకబడిపోయిందన్నారు. మంత్రి నారా లోకేశ్ యువగళంలో చేసిన హామీల మేరకు 20లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి అహర్నిసలు పని చేస్తున్నారన్నారు. అనంతరం గ్రామానికి చెందిన రెడ్డి శ్రీనివాసరావుకు సీఎం రిలీఫ్ ఫండ్ 1లక్షా 50వేల చెక్కును అందజే శారు. అనంతరం పురిటిపెంట గ్రామంలో రూ.53లక్షలతో నిర్మించిన ఎంఆర్‌సీని ప్రారంభించారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయంలో యువతతో సమావేశం నిర్వహించి.. రానున్న ఎన్నికలపై దిశా నిర్దే శం చేశారు. డీఈవో యు.మాణిక్యంనాయుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీదర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునా యుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.