Share News

గిరిజనుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Mar 17 , 2026 | 10:58 PM

గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

గిరిజనుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

- మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పాచిపెంట, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని కర్రివలస పంచాయతీ అమ్మవలసలో మంగళవారం నిర్వహించిన రైతన్నా మీకోసం, మెగా పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రైతన్నా మీకోసం కార్యక్రమం ప్రభుత్వం నిర్వ హిస్తుందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజనులు, మహిళలు స్వయంశక్తితో అభివృద్ధి చెందడానికి సాలూరు నియోజకవర్గానికి 650 నాటు కోళ్లు పెంపకం బుధవారం నుంచి దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు ప్రారంభిస్తారని తెలిపారు.

పాడి పశువుల పంపిణీ

ఐటీడీఏ ట్రైకార్‌ ద్వారా 451 యూనిట్లకు సంబంధించి రూ.5.86 కోట్ల విలువైన 902 పశువులను మంత్రి సంధ్యారాణి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్కో యూనిట్‌ ధర రూ. 65 వేలు కాగా అందులో 75 శాతం ప్రభుత్వం అం దజేస్తుందని, 25 శాతం వాటాగా లబ్ధిదారులు చెల్లించాలన్నారు. ప్రతి పశువుకూ బీమా సదుపాయం కల్పించామన్నారు. మక్కువ మండలానికి 127 యూనిట్లు, పాచిపెంటకు 109 యూనిట్లు, సాలూరుకు 68 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. ఒక్కో పశువు రోజుకు 8 నుంచి 12 లీటర్లు పాల దిగుబడి రాగా దీంతో అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 202 ఆవు దూడలను ప్రదర్శించా రు. అనంతరం గోకుల షెడ్‌, క్యాబ్‌ బుకింగ్‌ తరహాలో డ్రోన్‌ సేవలు, జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం పోస్టర్లు, బ్యానర్లను మంత్రి సంధ్యారాణి, కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆవిష్క రించారు. వీటికి సంబంధించి రూ.5 కోట్ల 86 లక్షల 30వేల చెక్కును మంత్రి పంపిణీ చేశారు. రైతుల వినతులను త్వరితగతిన పరిష్కరించా లని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశిం చారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఎస్‌.మన్మథరావు, జిల్లా వ్యవసాయాధి కారి, ఏపీవో, పి.మురళీధర్‌, స్థానిక ప్రజాప్రతి నిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 10:58 PM