Share News

పల్లెల అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:08 AM

పల్లెల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.

పల్లెల అభివృద్ధే ధ్యేయం

డెంకాడ, సెప్టెం బరు 29(ఆంధ్ర జ్యోతి): పల్లెల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా డెంకాడ నుంచి బంటుపల్లి వరకు సుమారు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి నిర్మాణానికి ఆమె మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మిరాకిల్‌ సీఈవో ప్రసాదరావు, డెంకాడ ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, జనసేన పార్టీ నాయకుడు సిరికి అప్పారావు, బీజేపీ మండల కిసాన్‌ మోర్చా అధ్యక్షురాలు రొంగలి లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:08 AM