నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:25 AM
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. గురువారం మండలంలోని డోకిశీల పంచాయతీ తేలునాయుడువలస నుంచి గంజిగడ్డ వరకు మంజూరైన బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
పార్వతీపురం రూరల్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. గురువారం మండలంలోని డోకిశీల పంచాయతీ తేలునాయుడువలస నుంచి గంజిగడ్డ వరకు మంజూరైన బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోకిశీల గ్రామాన్ని కంటిరెప్పలా చూసుకుంటాన న్నారు. అభివృద్ధికి కేరాఫ్‌గా నియోజకవర్గం ఉండాలన్నదే ధ్యేయమన్నా రు. కార్యక్రమంలో కొప్పుల వెలమ, నాగవంశపు కార్పొరేషన్ డైరెక్టర్లు జి.వెంకటనాయుడు, శంకరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు బోను దేవీచం ద్రమౌళి బొండపల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు జి.చంద్రమౌళి పాల్గొన్నారు.