మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:07 AM
గ్రామాల్లో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీతానగరం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ షరీఫ్ కోరారు. ఆదివారం మండలంలోని చిలకాం పంచాయతీ పరిధిలోగల దత్తివలసలో మత్తు పదా ర్థాలపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు.
గరుగుబిల్లి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీతానగరం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ షరీఫ్ కోరారు. ఆదివారం మండలంలోని చిలకాం పంచాయతీ పరిధిలోగల దత్తివలసలో మత్తు పదా ర్థాలపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.పద్మావతి ఆదేశాల మేరకు గరుగుబిల్లి, సీతానగరం, బలిజిపేట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో మత్తు పదార్థాలు, సారా సేవించడం, తయారీపై అవగాహన కల్పిస్తున్నా మని తెలిపారు. మత్తుపదార్థాలు సేవించడంతో భవిష్యత్ అంధకారంగా తయారవుతుందన్నారు. గ్రామాల్లో అమ్మకాలు జరిగినా, రవాణా జరిగినా సమాచారంఅందించాలని కోరారు. సమాజాన్ని మత్తు నుంచి కాపాడే బాధ్య త యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.