పేదల అభ్యున్నతే ధ్యేయం
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:03 AM
పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయమని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 44వ వ్యవస్థాపక దినం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పార్టీ చేసిన సేవలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను సన్మానించారు.
పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయమని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 44వ వ్యవస్థాపక దినం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పార్టీ చేసిన సేవలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను సన్మానించారు.
ఫకురుపాం,మార్చి29(ఆంధ్రజ్యోతి): కురుపాంలో టీడీపీ వ్యవ స్థాపక దినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్‌కట్ చేశారు. అనంతరం కురుపాం కోటలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైకర్ బోర్డు డైరెక్టర్ పువ్వల లావణ్య, ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, మండల కన్వీనర్ కేవీ కొండయ్య, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిఽధి కోలా రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ గుమ్మలక్ష్మీపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):గుమ్మలక్ష్మీపురంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి టీడీపీ జెండాను ఆవిష్క రించారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ అడ్డాకుల నరేష్, నాయకులు కడ్రక కళావతి, పెద్ద, వెంపటాపు భారతి, పాడి సుధ పాల్గొన్నారు.
ఫ పార్వతీపురం /రూరల్,మార్చి 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. మండలంలోని వెంకంపేట పంచాయతీ పరిధిలో ఉన్న టీడీపీ నియో జకవర్గ కార్యాలయంలో పార్టీవ్యవస్థాపక దినం నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్య క్రమంలో అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు, నాగవంశపు రా ష్ట్ర డైరెక్టర్ హనుమంతు లక్ష్మణరావు, బి.జయ ప్రకాష్‌నారాయణ, కోలా మధు, వెంకి వేణుగోపానలాయుడు, రైతు వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఫ పాలకొండ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పాలకొండలో టీడీపీ వ్యవస్థాపక దినాన్ని పార్టీ మండల కన్వీనర్ గండి రామినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ పాలకొండ నియోజ కవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకు లు ఖండాపు వెంకటరమణమూర్తి, వారాడ సుమంత్‌నా యుడు, సీఎల్.నాయుడు, గండి రామినాయుడు, సాసుబిల్లి బుజ్జి, గుమ్మడి సింహాద్రి, రత్నకుమారి, కొప్పర సుభాషిణి, జయలక్ష్మి, కుంపి, సూర్యారావు పాల్గొన్నారు.
ఫసాలూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):కార్యకర్తలే టీడీపీకి బలమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ తెలిపారు. ఆదివారం పట్టణంలో డీలక్స్ సెంటర్‌లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.