The goal is quality, free medical care. నాణ్యమైన ఉచిత వైద్యమే లక్ష్యం
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:48 PM
The goal is quality, free medical care. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (విలేజ్ హెల్త్ క్లినిక్‌లు) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 267 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంగళవారం మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.
నాణ్యమైన ఉచిత వైద్యమే లక్ష్యం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (విలేజ్ హెల్త్ క్లినిక్‌లు) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 267 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంగళవారం మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి క్లినిక్‌లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త ద్వారా సేవలు అందించడంతో పాటు 105 రకాల ఉచిత మందులు, 14 రకాల ప్రాథమిక వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. హబ్ అండ్ స్పోక్ విధానం, టెలీ మెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రజలకు నిపుణులైన వైద్యుల సలహాలు కూడా అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి ఉచితంగా వైద్యం అందించడం ద్వారా ప్రతి కుటుంబానికీ పటిష్టమైన ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విజయనగరం జిల్లాలో రూ.149.70లక్షలతో నిర్మించిన జగన్నాథపురం, పల్లి గండ్రేడు, కాపుశంభం, ఏనుగులవలస, అంబటివలస, సారపల్లి గ్రామాల్లో నిర్మించిన ఆరు విలేజ్ క్లినిక్‌లను మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్పరెన్ఫ్ హాలులో ఆరు విలేజ్ క్లినిక్‌ల శిలాఫలకాలను డీఆర్‌వో చందక సత్తిబాబు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దేవి, జిల్లా వైద్యాధికారి జీవనరాణి తదితరులు ఆవిష్కరించారు.