Share News

రైతు సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:15 AM

అన్నదాత సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

రైతు సంక్షేమమే లక్ష్యం

దత్తిరాజేరు(మెంటాడ), జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): అన్నదాత సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె మెంటాడలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల పాసుపుస్తకాలపై జగన్‌రెడ్డి తన బొమ్మ వేసుకు న్నారని.. చివరకు సర్వే రాళ్లపైనా బొమ్మలు వేసుకో వడం ఆయన ప్రచార పిచ్చికి పరాకాష్ట అన్నారు. తప్పుల తడకల రీసర్వే రైతులకు శాపంగా మారింద న్నారు. ఇప్పటికీ అనేకమంది రైతులు రెవెన్యూ కార్యా లయాల చుట్టూ తిరుగుతున్నారని అ న్నారు. కూటమి ప్రభుత్వం దీనిని గుర్తించి ప్రక్షాళన చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టా దారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నా మని తెలిపారు. గోకులాలు కావల్సిన రైతులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు యంత్ర పరికరాలు సబ్సిడీపై మంజూరు చేస్తున్నామని తెలిపా రు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం క్లీన్‌ స్వీప్‌ ఖాయమన్నారు. సుమారు 300 పాసుపుస్తకాలను పంపిణీ చేసిన ఆమె.. త్వరలోనే ఆర్వో ఆర్‌ పుస్తకాలను రైతులకు అందజేస్తారని చెప్పా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చలు మూరి వెంకటరావు, గెద్ద అన్నవరం, బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు, తహీసల్దార్‌ విజయభాస్కర్‌, ఎంపీడీ వో సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:15 AM