రైతు సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:15 AM
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యేలు అన్నారు.
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యేలు
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యేలు అన్నారు. సోమవారం పలుచోట్ల రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
డెంకాడ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. సింగవరం పంచాయతీలో సోమవా రం ఆమె రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపి ణీ చేశారు. మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, టీడీపీ నాయకులు పిట్ట అప్పారావు, మహంతి సత్యారావు, జొన్నాడ పీఏసీ ఎస్ అధ్యక్షుడు భవిరిశెట్టి శ్రీనివాసరావు, జనసేన పార్టీ కోఆర్డినేటర్ పైల శంకరరావు పాల్గొన్నారు.
నెల్లిమర్ల, మార్చి 2(ఆంధ్రజ్యోతి) దన్నానపేట గ్రామంలో ఎమ్మెల్యే నాగమాధవి సోమవారం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. తీర్మానాలు చెయ్యడం లో జాప్యం వల్ల సీసీ రోడ్లు, రహదారుల నిర్మాణానికి ఆటంకం కలిగిందని ఆమె తెలిపారు. ఖరీఫ్ నాటికి సాగునీటి చెరువులు, కాలువలను అభివృద్ధి చేస్తామ న్నారు. త్వరలోనే జలజీవన్ మిషన్ పనులు పూర్తిచేసి ప్రతిఇంటికీ కుళాయినీరు అందిస్తామని హామీ ఇచ్చా రు. టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్, ఏఎంసీ చైర్మన్ గేదెల గాయత్రి, గేదెల రాజారావు, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ చనమల్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జామి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రైతును రాజుగా చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయమని ఎమ్మె ల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం కలగాడ గ్రామంలో తహసీల్దార్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో రైతులకు ఆమె పట్టాదారు పాసుపుస్తకాలు అందించా రు. వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షుడు రమణ, పీఏసీఎస్ చైర్మన్ పీవీఆర్ వర్మరాజు తదితరులు పాల్గొన్నారు.