అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:30 AM
అన్ని రంగాల్లో అభివృద్ధి చేయ డమే ప్రభుత్వం లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.
నర్సిపురంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం
ఫపార్వతీపురం రూరల్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో అభివృద్ధి చేయ డమే ప్రభుత్వం లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. శనివారం మండలంలోని నర్సిపురంలో ఇంటింటికి తెలుగుదేశం కార్య క్రమా న్ని వర్షంలోనూ నిర్వహించారు. ఈసందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభి వృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి బోను అనూష, టీడీపీ మండలాద్యక్షుడు బోను దేవిచం ద్రమౌళి, నాయకులు గొట్టాపు వెంకటరమణ పాల్గొన్నారు.
పేదలకు సొంతింటి కల నెరవేరుస్తాం
పార్వతీపురంటౌన్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తోందని, వారి సొంతింటి కలను నెరవేరుస్తుం దని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. శనివారం పార్వతీపురం మునిసిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం మందిరంలో తొలి విడతగా 335 మంది టిడ్కో ఇళ్లకు సంబంధించి డిపాజిట్ దారులకు చెక్కులను అంద జేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం మునిసిపాలిటీలోని పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చడానికి లబ్ధిదారులు ఎంపికచేశామని చెప్పారు. 678 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారి చేత ఇళ్ల నిర్మాణం కోసం డిపాజిట్ చేయించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టక పోవడంతో కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత డిపాజిట్‌దారులకు వారి కట్టిన మొత్తాన్ని చెల్లించాలని, నిర్ణయించామన్నారు.