నాగూరులో గజరాజులు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:21 AM
నాగూరులో గజరాజులు సంచరిస్తున్నాయి.
గరుగుబిల్లి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): నాగూరులో గజరాజులు సంచరిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మండలంలోని సీతారాంపురం, ఉల్లిభద్ర, దళాయివలస, గొల్లవానివలస, గొట్టివలస, సాంబన్న వలసలో ఏనుగులు సంచరించాయి. గొట్టివలసకు చెందిన రైతుల పంటలను ధ్వంసం చేశాయి. సోమవారం నాగూరు పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరించడంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు, ట్రాకర్లు ఎనిమిది గజరాజుల గుంపును సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.