పునాదులు తేలిపోయి.. గోడలు బీటలు వారి
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:15 AM
మండ లంలోని సీతయ్యపేట గ్రామంలో గల ఎంపీపీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది.
ఇదీ సీతయ్యపేట ఎంపీపీ పాఠశాల పరిస్థితి
బొబ్బిలి రూరల్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): మండ లంలోని సీతయ్యపేట గ్రామంలో గల ఎంపీపీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం పునాదులు బయటకు తేలిపోవడంతోపాటు గోడలు బీటలు వారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. భవనం కింద భాగంలో మట్టి కొట్టుకుపోవడంతో పునాది రాళ్లు దెబ్బతిని బయటకు కనిపిస్తున్నాయి ప్రధానంగా వర్షాలు కురిసే సమయంలో భవనం మరింత బలహీనపడి కుప్పకూలే ప్రమాద ముందని, విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యార్ధులు చదువుకో వాల్సిన దుస్థితి ఏర్పడింది. పది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారు లు, ప్రజాప్రతి నిధులు తక్షణమే స్పందించి ఈ భవనానికి వెంటనే మరమ్మతులైనా చేప ట్టాలని లేదా కూల్చివేసి నూతన భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని గ్రా మస్థులు కోరుతున్నారు. కాగా భవనం దుస్థితిని ఉన్నతాధి కారులకు తెలియజేశామని, మరమ్మతులకు ప్రతిపాద నలు పంపామని ఎంఈవో గొట్టాపు వాసు తెలిపారు.