Share News

The five-year term has ended. ఐదేళ్ల పాలన ముగిసె

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:54 PM

The five-year term has ended. జిల్లాలో స్థానిక సంస్థలు ప్రతినిధుల ఐదేళ్ల పదవీకాలం ముగుస్తోంది. దీంతో పాలకవర్గాలు ‘మాజీ’ల జాబితాలో చేరనున్నాయి. 27 మంది మండల పరిఽషత్‌ అధ్యక్షులు, 449 మంది ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ఈనెల 23తో ముగుస్తోంది.

The five-year term has ended. ఐదేళ్ల పాలన ముగిసె

ఐదేళ్ల పాలన ముగిసె

నేటితో ముగియనున్న ఎంపీపీలు, ఎంపీటీసీల పదవీకాలం

24తో జడ్పీ ఛైర్మన్‌, జడ్పీటీసీలు

ఇప్పటికే మాజీ లైన 777 మంది సర్పంచిలు

ఇక ప్రత్యేకాధికారుల పాలనే

రాజాం రూరల్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో స్థానిక సంస్థలు ప్రతినిధుల ఐదేళ్ల పదవీకాలం ముగుస్తోంది. దీంతో పాలకవర్గాలు ‘మాజీ’ల జాబితాలో చేరనున్నాయి. 27 మంది మండల పరిఽషత్‌ అధ్యక్షులు, 449 మంది ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ఈనెల 23తో ముగుస్తోంది. జడ్పీ ఛైర్మన్‌తో పాటు మరో 26 మంది జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ఈనెల 24న ముగియనుంది. దీంతో వారంతా అధికార బాధ్యతల నుంచి తప్పుకుని మాజీలు కానున్నారు. ఇప్పటికే 777 మంది సర్పంచిలు మాజీల జాబితాలో చేరిపోయారు.

- స్థానిక సంస్థలకు మళ్లీ ఎన్నికలు జరిగి నూతన పాలకవర్గాలు కొలువుదీరే వరకూ ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనకు శ్రీకారం చుట్టనుంది. జడ్పీకి కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా వ్యవహరించనుండడంతో కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి త్వరలో జడ్పీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక మండల పరిషత్‌ల విషయానికొస్తే ఎంపీడీవోల కంటే ఎక్కువ హోదా ఉన్నవారినే ప్రత్యేకాధికారులుగా నియమించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో 27 మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకాల విషయంలో కసరత్తు ప్రారంభమైంది. ఈనేపథ్యంలో మండలాలకు ప్రత్యేకాధికారులుగా జిల్లా అధికారులు, డిప్యుటీ డైరెక్టర్లు, ఆర్డీవోలను నియమించే అఽధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ప్రత్యేకాధికారుల పాలన ఈనెల 24 నుంచి ఆరు నెలలు లేదా ఎన్నికలు పూర్తయ్యేవరకూ కొనసాగనుంది.

స్థానిక పోరుకు సన్నాహాలు..

ఙిల్లాలోని 27 మండలాల్లో ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాదేశికాల ఎన్నికలకు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ‘సర్‌’ కు ముందున్న వివరాల మేరకే ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను ఇప్పటికే అన్ని కార్యాలయాల వద్ద ప్రచురించారు. ఫొటో ఓటర్ల జాబితాలను జడ్పీ, మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచారు. 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఐదేళ్ల పదవీకాలం పూర్తికావడంతో స్థానిక ప్రజాప్రతినిధులంతా మాజీలవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.

జిల్లాలో..

అసెంబ్లీ స్థానాలు 7

మండలాలు 27

ఎంపీటీసీలు 449

జడ్పీటీసీలు 27

పోలింగ్‌ కేంద్రాలు 7398

పురుష ఓటర్లు 6,36,006

మహిళా ఓటర్లు 6,49,664

ఇతరులు 34

మొత్తం ఓటర్లు 12,85,704

----------------------------------

ఏ హడావిడి లేకుండానే..

ముగుస్తున్న ఉమ్మడి జిల్లా జడ్పీటీసీల పదవీకాలం

విజయనగరం కంటోన్మెంట్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం జరుపుకోవాలని ఇటీవల నిర్ణయించినప్పటికీ అనుకోని పరిణామాలతో వాయిదా పడి చివరకు సమావేశం కాకుండానే జడ్పీటీసీల గడువు పూర్తవుతోంది. ప్రస్తుత పాలక వర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన 34మండలాల జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఈనెల 24తో పదవీ కాలం ముగియనుండటంతో చివరి సమావేశాన్ని తీపిగుర్తుగా నిర్వహించుకోవాల నుకున్నారు. అంతలోనే ఊహించని పరిణామాలు జరిగాయి. జడ్పీలో కీలకంగా ఉండే చైర్మన్‌ పార్టీ మారడంతో చివరి సమావేశానికి బ్రేక్‌ పడినట్లు అయింది. జిల్లా ప్రజా పరిషత్‌ సర్వ సభ్యసమావేశం జూలైలో జరిగింది. నాటి సమావేశానికి అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యేగాని, ఎంపీగాని హాజరుకాలేదు. ఆ తర్వాత ఈనెల 9న సమావేశం జరుగనున్నదని ప్రకటించి ఏమైందో ఏమో వాయిదా వేసి మిన్నకున్నారు. మారిన రాజకీయ సమీకరణాల రీత్యా ఇక సమావేశం జరిగే అవకాశం లేకపోయింది.

----------------------------

Updated Date - Sep 22 , 2026 | 11:54 PM