రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ అన్యాయం
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:18 AM
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహు ల్‌గాంధీపై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అన్యా యమని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు తెలిపారు.
బెలగాం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహు ల్‌గాంధీపై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అన్యా యమని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు తెలిపారు. సోమవారం పార్వతీపురంలో కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఘటనకు బాధ్యులైన ఉత్తరాఖండ్ బీజేపీ శ్రేణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.