The expansion of the temple should be completed by Ammavari festival అమ్మవారి పండగ నాటికి ఆలయ విస్తరణ పూర్తి చేయాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:55 PM
The expansion of the temple should be completed by Ammavari festival
అమ్మవారి పండగ నాటికి
ఆలయ విస్తరణ పూర్తి చేయాలి
దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్
విజయనగరం కల్చరల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడిమాంబ ఆలయ విస్తరణ పనులను అమ్మవారి పండగ నాటికి పూర్తి చేయాలని దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. ఆలయ విస్తరణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏఏ నిర్మాణాలు చేపడుతున్నారని ఇంజినీరింగు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీలేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసి సిరిమానోత్సవానికి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఆలయం ఇరువైపులా సేకరించిన స్థలం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని మరిన్ని సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతంలో పైడిమాంబ ఆలయం ఇరుగ్గా ఉండేదని, పండుగ సీజన్‌లో భక్తులకు అసౌకర్యంగా ఉండేదని, ఆలయ విస్తరణ పనులు అనంతరం ఈ పరిస్థితి ఉండదన్నారు. నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆలయ అధికారి కె.శిరీష, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావుతో మాట్లాడారు. ఆయన వెంట దేవదాయశాఖ కార్యనిర్వహక ఇంజినీరు కెవీసీ కృష్ణ, సహాయ ఇంజనీరు సాయి కృష్ణ తదితరులు ఉన్నారు.