Share News

ప్రపంచమే భోగాపురం వైపు చూడాలి

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:36 AM

ప్రపంచ మంతా భోగాపురం వైపు చూడాలని గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు.

ప్రపంచమే భోగాపురం వైపు చూడాలి

  • మన్యం వీరుని వీరత్వానికి గుర్తింపుగా అల్లూరి పేరు

  • గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు

విజయనగరం, జూలై 31(ఆంధ్రజ్యోతి): ప్రపంచ మంతా భోగాపురం వైపు చూడాలని గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల సేవలను ఎప్పుడూ మరవరాదని, ఈ పోరులో వీరత్వం పొందిన అల్లూరి సీతారామరాజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌తో ఆయన మాట్లాడు తూ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ వారికి ఎదరెళ్లి గుండెను చూపిన ధైర్యశాలని అని కొని యాడారు. నేడు జాతికి అంకితం కానున్న భోగాపురం విమానాశ్రయానికి ఈ పేరును తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుర్తుచేశా నని తెలిపారు. కోరుకొండ సైనిక్‌ పాఠశాలలో చదివి దేశసేవలో ప్రాణత్యాగం చేసిన కల్నల్‌ సంతోష్‌ బాబు ను కూడా మనం మరువ రాదన్నారు. విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, వెనుక ఉంచబడిన జిల్లా అని అన్నారు. కార్గోసే వల విషయంలో కాలాను గుణంగా ధరల్లో మార్పులు ఉంటాయని, ఇది ఎక్కడై నా సహజమేనని అన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 12:36 AM