ఈకేవైసీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , Publish Date - May 06 , 2026 | 12:17 AM
రీసర్వే గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ఈకేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఆర్.వైశాలి సూచించారు.
పార్వతీపురం ఐటీడీఏ పీవో వైశాలి
సీతానగరం, మే 5(ఆంధ్రజ్యోతి): రీసర్వే గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ఈకేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఆర్.వైశాలి సూచించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా ఆమె సందర్శించారు. భూముల రీసర్వే పనులు, ఈకేవైసీ నమోదు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రింటింగ్‌కు అర్హత పొందిన పత్రాలను నిశితంగా పరిశీలించి లోపాలు లేకుండా చూడాలని తహసీల్దార్ ప్రసన్నకుమార్‌ను ఆదేశించారు. అలాగే పరిశీలన పూర్తయిన, ప్రింటింగ్‌కు సిద్ధంగా ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకా లను వెంటనే ప్రింటింగ్‌కు పంపించి రైతులకు సకాలంలో అందజేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, క్షేత్ర స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు.