Share News

పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:46 PM

జిల్లాలో జరుగుతున్న రీసర్వే భాగంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపి ణీ వేగవంతం చేయాలని కలె క్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి ఆదేశిం చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి జి.సాయిప్రసాద్‌, సీసీ ఎల్‌ఏ జి.వరలక్ష్మి బుధవారం కలెక్టర్‌తో అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న రామసుందర్‌రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న రీసర్వే భాగంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపి ణీ వేగవంతం చేయాలని కలె క్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి ఆదేశిం చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి జి.సాయిప్రసాద్‌, సీసీ ఎల్‌ఏ జి.వరలక్ష్మి బుధవారం కలెక్టర్‌తో అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 22ఏ, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీసర్వే, పీజీఆర్‌ఎస్‌, ఐవీఆర్‌ఎస్‌ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రీసర్వే ప్రక్రియలో ఎక్కడ జాప్యం జరగకూడదని స్పష్టంచేశారు. నిర్ధేశించిన గడువులోగా రీసర్వేతోపాటు ఈకెవైసీ ప్రక్రియను శతశాతం పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్‌, డీఆర్వో మురళి, ఆర్డీవో సుధారాణి, మోహనరావు, సర్వే శాఖ ఏడీ విజయకుమార్‌ పాల్గొన్నారు.

ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించండి

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎస్‌.రామ సుందర్‌రెడ్డి కోరారు. జిల్లాస్థాయిలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో, నియోజకవర్గ స్థాయిలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆదివారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే ఉత్సవాలకు మూడువేల మంది హాజరుకానుండడంతో వారికి తాగునీరు, స్నాక్స్‌ తదితర సదుపాయాలు కల్పించాలని కమిషనర్‌ బాలాస్వామికి సూచించారు. అన్నిమండలాల నుంచి బస్సుసౌకర్యంకల్పించాలని ఆర్టీసీ అఽధికారులకు సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలను సన్మానించడానికి విజయగాఽథలు వారే వివరించేలా ఏర్పాట్లుచేయాలని డీఆర్‌డీఏ పీడీకి సూచించారు.సమావేశంలో జేసీ సేతుమాధవన్‌, ఏఎస్పీ సౌమ్యలత, ఆర్డీవో వెంకటేశ్వరరావు, బాలాజీ పాల్గొన్నారు.

ఉద్యానవన సాగు విస్తీర్ణం పెంచాలి

విజయనగరంబాబామెట్ట, మార్చి4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో లక్ష్యం మేరకు ఉద్యాన వన సాగువిస్తీర్ణం పెంచడానికి ప్రణాళికసిద్ధం చేసుకోవాలని, అర్హత గల రైతులందరికీ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. వరి వంటి నీటి ఆధారిత పంటలను పండిస్తున్న రైతులు ఉద్యానవన పంటలు సాగు చేయడానికి ప్రొత్సహించే చర్యల్లో భాగంగా రబీలో 4,500 ఎకరాలు సాధించినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌నకు లక్ష్యంగా నిర్ణయించిన ఆరు వేల ఎకరాల్లో కాకుండా అధికంగా సాగుచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Mar 04 , 2026 | 11:46 PM