Share News

నియోజకవర్గం అభివృద్ధే ఽధ్యేయం

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:11 AM

నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నివిధాలా అభివృద్ధి చేయ డమే ధ్యేయమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.

 నియోజకవర్గం అభివృద్ధే ఽధ్యేయం
రైతుబజారును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి :

భోగాపురం, సెప్టెంబరు16 (ఆంధ్రజ్యో తి): నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నివిధాలా అభివృద్ధి చేయ డమే ధ్యేయమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. భోగాపురం లో రూ.74లక్షలతో నిర్మించిన రైతు బజా ర్‌ను బుధవారం ప్రారంభించారు. ప్రా రంభోత్సవం కార్యక్రమానికి జనసేన నా యకులు మినహా పూసపాటిరేగ మార్కె ట్‌ కమిటీ అధ్యక్షురాలు గాయిత్రితో సహా ఎవరూ హాజరుకాకపోవడం విశేషం. కాగా మార్కెట్‌ కమిటీ స్థలం జిరాయితీ స్థలమ ని, దీనిని కొంతమంది వ్యక్తులు రెవెన్యూరికార్డుల్లో మార్పిడి చేశారని అనంతరం ప్రభుత్వ ఆక్రమించిదని రైతుబజార్‌ గేటు ముందు బ్యానర్‌ ఉంచి ఓ వ్యక్తి నిరసన తెలిపారు. దీంతో స్పందించిన రెవెన్యూ, పోలీస్‌సిబ్బంది ఆధారాలు ఉంటే చూపించా లని చెప్పి అక్కడ ఏర్పాటుచేసిన బ్యానర్‌ తొలగించారు. కాగా ముంజేరులో రూ.10.09 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

Updated Date - Sep 17 , 2026 | 12:11 AM