మృతుడు సింహాద్రిగా గుర్తింపు
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:15 AM
జిల్లా మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో ని పాడుబడిన భవనంలో సోమవారం అనుమానాస్పద రీతిలో బయటపడ్డ మృతదేహాన్ని గుర్తించినట్టు టూటౌన్ సీఐ ఈశ్వరరావు మంగళవారం తెలిపారు.
శ్రీకాకుళం క్రైం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో ని పాడుబడిన భవనంలో సోమవారం అనుమానాస్పద రీతిలో బయటపడ్డ మృతదేహాన్ని గుర్తించినట్టు టూటౌన్ సీఐ ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. మృతుడు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వడమ గ్రామానికి చెందిన బొద్దాన సింహాద్రి(48)గా గుర్తించామన్నారు. వృత్తిరీత్యా భవన నిర్మాణ కార్మికుడైన సింహాద్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడని చెప్పారు. ఈ నెల 9న ఇంటి వద్ద చెప్పకుండా బయలుదేరి శ్రీకాకుళం చేరుకొని మృత్యశాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నాడని చెప్పారు. పాడుబడిన భవనంలో ఉంటూ నిద్రాహారాలు లేక మృతి చెందినట్టు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఈ నెల 9న పాల కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారన్నారు. కుటుంబ సభ్యులు వచ్చి మృతుడు సింహాద్రిగా గుర్తించారని వివరించారు. మంగ ళవారం శవ పంచానామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్ప గించినట్టు తెలిపారు. టూటౌన్ ఎస్‌ఐ హైమావతి కేసు నమోదు చేశారని తెలిపారు. మృతుడికి భార్య, పదేళ్ల కుమార్తె ఉన్నారని ఆయన వివరించారు.