Share News

రామతీర్థంలో ఘనంగా పట్టాభిషేకం

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:54 PM

ప్రసిద్ధ పుణ్యక్షే త్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో ఆది వారం పునర్వసు నక్షత్రాన్ని పురష్కరించుకొని శ్రీరామ పట్టాభిషేకాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.

రామతీర్థంలో ఘనంగా పట్టాభిషేకం

నెల్లిమర్ల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షే త్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో ఆది వారం పునర్వసు నక్షత్రాన్ని పురష్కరించుకొని శ్రీరామ పట్టాభిషేకాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రాతఃకాలార్చన, బాలభోగం పూర్తి చేశారు. యాగశాలలో సుందరకాండ హవనం చేశారు. అనంత రం శ్రీరామునికి నిత్యకల్యాణం నిర్వహించారు. ఆస్థాన మండపంలో ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలోని పట్టాభిషేకం సర్గను విన్నవించారు. శ్రీరామ చంద్రునికి పంచామృత అభిషేకం, పట్టాభిషేకం చేశారు. సీతారా ములను వివిధ పుష్పాలతో అలంకరించారు. ఈ కార్య క్రమంలో కార్యనిర్వహణాధికారి వై.శ్రీనివాసరావు, అర్చ కులు ఖండవల్లి సాయిరామాచార్యులు, ఖండవిల్లి కిర ణ్‌కుమార్‌, గొడవర్తి నరసింహాచార్యులు, పానంగపల్లి ప్రసాద్‌, సుదర్శనం పవన్‌ కుమార్‌, రాంగోపాల్‌, సూప రింటెండెంట్‌ రామారావు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:54 PM