కోర్టు భవనాల నిర్మాణం వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:07 AM
జిల్లా కోర్టు నూతన భవనాల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు.
మంత్రి శ్రీనివాస్‌కు బార్ అసోసియేషన్ సభ్యుల వినతి
విజయనగరం, జూలై 12(ఆంధ్రజ్యోతి): జిల్లా కోర్టు నూతన భవనాల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు వారు ఆదివారం విజయనగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన్ని కలిసి, వినతిపత్రం అందజే శారు. ఈసందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో ప్రస్తుతం నిర్మిస్తున్న జిల్లా కోర్టు భవన నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయాయని, పెండిం గ్ బకాయిలు చెల్లించేందుకు సహకరించాలని కోరారు. గత భవనం శిథిలావస్థకు చేరుకోవటంతో ఎంఆర్‌పీజీ విసతిగృహంలో తాత్కాలిక కోర్టును నిర్వహిస్తున్నట్టు మంత్రి దృష్టికి బార్ అసోసియేషన్ సభ్యులు తీసుకొ చ్చారు. తక్షణమే పెండింగ్ నిధులు మంజూరుకు సహకరించి కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తయ్యేలా తోడ్పాటునివ్వాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లలితం రమేష్, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబరు బెల్లాన రవి, సీనియర్ న్యాయ వాది, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంటుబు క్త శ్రీనివాసరావు పాల్గొన్నారు.