Share News

చికిత్స పొందుతూ కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:04 AM

స్థానిక సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ టి.తిరుపతి రావు(36) బుధవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతిచెం దారు.

చికిత్స పొందుతూ కానిస్టేబుల్‌ మృతి

గజపతినగరం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): స్థానిక సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ టి.తిరుపతి రావు(36) బుధవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతిచెం దారు. ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిరావు ఈనెల 14న ముచ్చర్ల గ్రామంలో విధుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కేంద్రాసుపత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడికి భార్య దమయింతి, పిల్లలు శ్రీదర్సన్‌, బివేష్‌ కలరు. కానిస్టేబుల్‌ మృతిపై సీఐ రమణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గజపతినగరం, బొండపల్లి, పెదమానాపురం, స్టేషన్‌ బూర్జివలస, ఆండ్ర పోలీస్‌స్టేషన్‌లో గల ఎస్‌ఐలు, సిబ్బంది సంతాపం తెలిపా రు. బొబ్బిలి మండలం కింతలవానిపేటలో డిఎస్పీ భవ్యరెడ్డి ఆధ్వర్యంలో దహన సంస్కరణలు చేపట్టారు. అలాగే మంత్రి కొండ పల్లి శ్రీనివాస్‌ దహనసంస్కరణల వద్దకు వెళ్లి సంతాపం తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు. పోలీసు శాఖ తరపున తిరుపతిరావు కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు అందజేశారు.

Updated Date - Jan 23 , 2026 | 12:04 AM