‘కమిటీ రోల్ అమలు చేయాల్సిందే..’
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:16 AM
బీసీ హాస్టళ్లలో కమిటీ రోల్ కచ్చితంగా అమలు చేయాలని సహాయ బీసీ సంక్షేమాధికారి ఎండ అప్పన్న హెచ్‌డబ్ల్యూవోలను ఆదేశించారు.
జియ్యమ్మవలస, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): బీసీ హాస్టళ్లలో కమిటీ రోల్ కచ్చితంగా అమలు చేయాలని సహాయ బీసీ సంక్షేమాధికారి ఎండ అప్పన్న హెచ్‌డబ్ల్యూవోలను ఆదేశించారు. మంగళవారం ఆయన చినమేరంగిలోని మూడు బీసీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల భోజనాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులతో ఫుడ్ కమిటీ, ఎడ్యుకేషన్ కమిటీ, ముస్తాబు కమిటీ, ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేయా అమలు చేయాలన్నారు. హాస్టళ్లను శుభ్రంగా ఉంచి ముస్తాబు నిబంధనలు పాటించాలన్నారు. అలాగే ఉదయం విద్యార్థులతో యోగా, సాయంత్రం ఆట పాటలు కొనసాగించాలన్నారు కార్యక్రమంలో ప్రీ మెట్రిక్ హాస్టల్ హెచ్‌డబ్ల్యూవో ఎన్.శ్రీనివాసరావు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ హెచ్‌డబ్ల్యూవో అనురాధ పాల్గొన్నారు.