జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఘనత కూటమిదే
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:10 AM
ఏపీ చరిత్రలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఘనత కూట మి ప్రభుత్వం, మంత్రి లోకేశ్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు.
ఎమ్మెల్సీ చిరంజీవిరావు
విజయనగరం టౌన్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఏపీ చరిత్రలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఘనత కూట మి ప్రభుత్వం, మంత్రి లోకేశ్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గురజాడ కళాభారతి ఓపెన్ ఆడిటోరియంలో ఆదివా రం సాయంత్రం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబా బు, మంత్రి నారా లోకేష్‌ల కృషి వల్లనే నిరుద్యోగుల కల సాకారం అవుతుందన్నారు. విశిష్ట అతిథి, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువరన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. కాకినాడ శ్యాం ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్, వేదిక ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, అభ్యుదయ వేదిక అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, అధిక సంఖ్యలో నిరుద్యోగాలు పాల్గొన్నారు.