సీఎం సహాయ నిధి పేదలకు సంజీవని
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:13 AM
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు సంజీవని గా నిలుస్తుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.
ఎమ్మెల్యే కోండ్రు
రాజాం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు సంజీవని గా నిలుస్తుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఆదివారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో ఆయన 64 మంది లబ్ధిదారులకు రూ.25 లక్షల 2,641 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు.
పేదలందరికీ పక్కా గృహాలు..
రాజాం మున్సిపాలటీతో పాటు గ్రామాలలో నివాసం ఉంటున్న పేదలకు పక్కా గృహాలు మంజూరు చేసేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. ఆదివారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో ఆయన పీఎంఏవై పథకం కింద ఇళ్లు మంజూరైన 159 మందికి మంజూరుపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, పార్టీ నాయకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, వల్లూరు గణేష్, అధికారులు పాల్గొన్నారు. శ్యాంపురం గ్రామంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
బీసీల బాంధవుడు చంద్రబాబు
రాజాం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): బీసీల బాంధవుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఆదివారం పాలకొండ రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌కు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. దీనిపై వైసీపీ నేతలు కుట్రలు చేస్తూ అడ్డుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాస రావు, కోటగిరి నారాయణరావు, దూబ ధర్మారావు పాల్గొన్నారు.