Share News

The city wears a festive look. నగరానికి పండగ శోభ

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:01 AM

The city wears a festive look. సిరిమానోత్సవం సమీపిస్తుండడంతో ఏర్పాట్లు జోరందుకున్నాయి. సిరిమాను చెట్టు కూడా చేరుకోవడంతో పండగ పనులు వేగవంతం కానున్నాయి. పైౖడిమాంబ దర్శనానికి భక్తజనం పోటెత్తుతున్నారు.

The city wears a festive look. నగరానికి పండగ శోభ
అమ్మవారి దర్శనానికి ఘటాలతో భక్తులు

నగరానికి పండగ శోభ

పైడిమాంబ దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

అన్ని వీధుల నుంచి ఘటాలతో రాక

సిరిమానోత్సవం సమీపిస్తుండడంతో ఏర్పాట్లు జోరందుకున్నాయి. సిరిమాను చెట్టు కూడా చేరుకోవడంతో పండగ పనులు వేగవంతం కానున్నాయి. పైౖడిమాంబ దర్శనానికి భక్తజనం పోటెత్తుతున్నారు. మంగళవారం ఆలయం వద్ద క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఘాటాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. చదురుగుడి వద్ద పండగ వాతావరణం కన్పించింది. ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనానికి వేర్వేరుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. హుకుంపేటలోని పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. మరోవైపు సిరిమాను, ఇరుసుమానులను తయారు చేసేందుకు వండ్రంగులు సిద్ధమయ్యారు.

- విజయనగరం కల్చరల్‌/ రూరల్‌, అక్టోబరు 13 ( ఆంధ్రజ్యోతి)

Updated Date - Oct 14 , 2026 | 12:01 AM