కొండెక్కిన కోడి
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:29 PM
చికెన్ ధరలు మాంస ప్రియులను హడలెతిస్తున్నా యి.
- పెరిగిన చికెన్ ధరలు
- స్కిన్‌లెస్ కిలో రూ.310
సాలూరు రూరల్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): చికెన్ ధరలు మాంస ప్రియులను హడలెతిస్తున్నా యి. ఇటీవల బర్డ్‌ఫ్లూ ప్రచారంతో తగ్గిన కోడి మాంసం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనుకాడుతున్నారు. కొద్దిరోజుల కిందట లైవ్ బ్రాయిలర్ కోడి కిలో రూ.128 ఉండేది. మాంసం కిలో రూ.200 పైబడి ఉండేది. ప్రస్తుతం బ్రాయిలర్ కోడి లైవ్ కిలో రూ.167 ఉండగా, మాంసం రూ.280 నుంచి 290 వరకు, స్కిన్‌లెస్ కిలో రూ.300 నుంచి 310 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇటీవల బర్డ్‌ఫ్లూ భయంతో పాటు పౌలీ్ట్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల కారణంగా కోళ్ల పెంపకం తగ్గింది. దీంతో కోళ్ల కొరత ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయని, రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఏవోబీలో ఉన్న జిల్లాలకు గతంలో ఒడిశా నుంచి కోళ్లు దిగుమతి అయ్యేవి. ఒడిశాలో సైతం కోళ్ల ధరలు పెరగడంతో పాటు కొరత ఉంది. దీంతో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కోళ్లను తెస్తున్నారు.