The chariot of Pydimamba moves. పైడిమాంబ రథం కదిలె
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:18 AM
The chariot of Pydimamba moves. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ దేవర ఉత్సవాన్ని సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని వనంగుడి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ పురవీధుల్లో ఊరే గింపుగా హుకుంపేటకు తెచ్చారు.
పైడిమాంబ రథం కదిలె
భక్తిశ్రద్ధలతో అమ్మవారి దేవర ఉత్సవం
ఊరేగింపులో ఆకట్టుకున్న కోలాటం, పులివేషాలు
విజయనగరం రూరల్/ కల్చరల్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ దేవర ఉత్సవాన్ని సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని వనంగుడి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ పురవీధుల్లో ఊరే గింపుగా హుకుంపేటకు తెచ్చారు. తొలుత పైడిమాంబ దేవర ఉత్సవరథాన్ని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు పూజల అనంతరం ముందుకు లాగారు. జై పైడిమాంబ నామస్మరణతో వనంగుడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు రథం బయలుదేరింది. అక్కడి నుంచి హుకుంపేటకు చేరుకుంది. ఊరేగింపులో చిన్నారుల కోలాటం, శక్తివేషాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారికి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు నివాసం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాత్రి 10 గంటలకు హుకుంపేట నుంచి అమ్మవారి చదురుగుడికి తరలించారు. తెల్లవారుజామున 4 గంటలకు పెద్ద చెరువులో మునిగి మట్టిని తీసి.. ఆ మట్టితో పాటు, పసుపు, కుంకుమ చదురుగుడిలో అమ్మవారి ఘటాలకు పూయడం అనవాయితీ.
విస్తరణ పనులను పరిశీలించిన కమిషనర్ రామచంద్రమోహన్
పైడిమాంబ ఆలయ విస్తరణ పనులను దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సోమవారం పరిశీలించారు. సహాయ కమిషనర్ శీరిషాతో కలిసి ఇంజనీరింగు అధికారులతో మాట్లాడారు. ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయని, సిరిమానోత్సవం నాటికి పూర్తి కావాలని అన్నారు. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఆలయ పునఃప్రతిష్ఠ జరుగుతుందన్నారు.