Share News

ముగిసిన జగన్నాథుని రథోత్సవాలు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:56 AM

ఈ నెల 16 నుంచి ప్రారంభ మైన జగన్నాధ రథయాత్ర మహోత్సవాలు శుక్రవారంతో వైభవంగా ముగిశాయి.

ముగిసిన జగన్నాథుని రథోత్సవాలు
స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరిన భక్తులు

విజయనగరం కల్చరల్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 16 నుంచి ప్రారంభ మైన జగన్నాధ రథయాత్ర మహోత్సవాలు శుక్రవారంతో వైభవంగా ముగిశాయి. మారు రథయాత్ర సందర్భంగా జగన్నాథస్వామి ద ర్శనానికి భక్తజనం తరలివచ్చింది. దాసన్నపే ట నవాబుపేట కూడలి, కన్యకాపరమేశ్వరీ ఆలయ కూడలి వద్ద రథాలపై కొలువైన బలభద్ర సుభద్రా సమేత జగన్నాథుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. రాత్రి వరకు క్యూలైన్లో ఉన్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ మారు రథయాత్ర జాతరను తలపించింది. దాసన్నపేట డబ్బూరి ఫంక్షన్‌ హాల్‌ నుంచి నవాబుపేట కూడలి వరకూ జాతర కారణంగా వాహనాలను అనుమతించలేదు. కన్యకాపరమేశ్వరీ కూడలిలో కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తజనం తరలివచ్చింది. మారు రథయాత్ర అనంతరం శనివారం ప్రధాన ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమం, శాంతి హోమం అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:56 AM