Share News

Always Been Held by Women నాటి నుంచి మహిళదే పీఠం

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:22 AM

The Chairperson’s Post Has Always Been Held by Women జమిందారుల పాలన, బ్రిటిష్‌ వారితో పోరాటాలు, శ్రీకాకుళం ఏర్పాటు.. ఇలా ఎన్నో చారిత్రక ఘట్టాలతో పాలకొండ ప్రస్థానం ముడిపడి ఉంది. 1944లో ఇది పంచాయతీగా ఏర్పడింది. ఆ తర్వాత మేజర్‌ పంచాయతీగా రూపాంతరం చెందింది. గతంలో పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల ఏర్పాటులో భాగంగా పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలో చేరింది.

 Always Been Held by Women నాటి నుంచి  మహిళదే పీఠం
పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం

  • 2013లో మేజర్‌ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌

  • చైర్‌పర్సన్‌ సీటు అతివలకే కేటాయింపు

  • కలిసొస్తున్న రిజర్వేషన్‌

పాలకొండ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జమిందారుల పాలన, బ్రిటిష్‌ వారితో పోరాటాలు, శ్రీకాకుళం ఏర్పాటు.. ఇలా ఎన్నో చారిత్రక ఘట్టాలతో పాలకొండ ప్రస్థానం ముడిపడి ఉంది. 1944లో ఇది పంచాయతీగా ఏర్పడింది. ఆ తర్వాత మేజర్‌ పంచాయతీగా రూపాంతరం చెందింది. గతంలో పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల ఏర్పాటులో భాగంగా పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలో చేరింది. కాగా 2013లో టీడీపీ ప్రభుత్వం పాలకొండను నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేసింది. పట్టణం 11.32 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 2011 లెక్కల ప్రకారం అప్పట్లో 31,466 మంది వరకు జనాభా ఉండగా.. అప్పట్లో 20 వార్డులు ఉండేది. నగర పంచాయతీ మొదట చైర్‌పర్సన్‌ను బీసీ మహిళకు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మహిళలకే ఆ సీటు దక్కుతుంది. 2014లో టీడీపీ ప్రభుత్వం నగరపంచాయతీ ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో టీడీపీ సీనియర్‌ నాయకుడు పల్లా కొండలరావు సతీమణి విజయనిర్మల చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు నగర పంచాయతీ ప్రత్యేక అధికారుల పాలనలోనే నడిచింది. 2021లో నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. 2021 నుంచి 2026 వరకు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా వైసీపీ నుంచి యందవ రాధాకుమారికి అవకాశం దక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర పంచా యతీలో వార్డుల సంఖ్యను 20 నుంచి 28కి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. చైర్‌పర్సన్‌ సీటు బీసీ మహిళకు రిజర్వ్‌ చేశారు. అయితే ముచ్చటగా మూడోసారి కూడా నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ పీఠం మహిళలకే దక్కినట్టు అయింది. తొలి నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పల్లా విజయనిర్మల జనసేన పార్టీ నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలవడం విశేషం. నగర పంచాయతీలో 23,466 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 11,453 మంది, మహిళలు 12,012 మంది ఉన్నారు. ఒకరు ఇతరులు ఉన్నారు. 28 వార్డుల నుంచి కౌన్సిలర్ల అభ్యర్థులు బరిలో ఉన్నారు.

గతంలో పనిచేసిన సర్పంచ్‌లు వీరే..

మొదటి సర్పంచ్‌గా ఎల్లుమహంతి భాస్కరరావు 1944-1951 వరకు వ్యవహరించారు. 1951-53 కోరాడ సూర్యనారాయణ, 1964-70 ఎల్‌.సూర్యనారాయణమ్మ నాయురాలు, 1970-72, 1972-81, పైడి శ్రీరామ్మూర్తి, 1981-88 దుప్పాడ సూర్యనారాయణ, 1988-1991 కోరాడ వెంకటరావు, 1991-93 గోపాలరాజు, 1993-95 సాసుబల్లి తవిటినాయుడు, 1995-2000 పడాల నరసింగరావు, 2001-2006 పల్లా కొండలరావు, 2006-2011 వరకు చొంగ రమాదేవి సర్పంచ్‌లుగా ఉన్నారు. 2011-2013 వరకు ప్రత్యేకాధికారుల పాలన సాగింది.

చరిత్ర ఇదే...

- పాలకొండలు అనేవి రాష్ట్రంలోని తూర్పు కనుమలలో భాగమైన ఒక ప్రముఖ కొండల శ్రేణి. ఇవ వాయువ్య దిశ నుంచి ఆగ్నేయం వరకు విస్తరించి తిరుపతి వద్ద ముగుస్తాయి. అప్పట్లో విజయనగరం సంస్థానానికి సామంతులుగా ఉన్న కొండ జమిందారుల పాలనలో ఉండే పాలకొండలో పశుసంపద అధికంగా ఉండేది. నలువైపులా కొండలు ఉండేవి. ఆ సమయంలో కొండ ప్రాంతాల నుంచి వెళ్లే మునులు పాడి సంపదను చూసి ఇది పాలకుండగా పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతుంది. పట్టణంలో వెంకటరాజు చెరువు గట్టుపై భారీ సర్పం వేడి పాల కుండలోకి దూకి చనిపోవడంతో.. అప్పటి రాజులు పట్టణానికి పాలకుండగా నామకరణం చేశారని మరో చరిత్ర చెబుతుంది. కాలక్రమంలో పాలకొండగా మారిందని పూర్వీకులు చెబుతున్నారు.

- బ్రిటిష్‌ కాలంలో పాలకొండ జమిందారీ కుటుంబానికి చెందిన ముఖ్యులను బ్రిటిష్‌ వారు ఖైదు చేసి వెల్లూరు కోటలో నిర్బంధించారు. ఈ కుటుంబానికి చెందిన విజయరామరాజుకు తొలుత మరణ శిక్ష విధించి ఆ తర్వాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. 1843లో గుత్తికోటలో మరణించారు. 1869లో మద్రాసు గవర్నర్‌ వెల్లూరును సందర్శించినప్పుడు విజయ రామరాజును విడుదల చేసి కృష్ణానది తీరంలో నివసించడానికి అనుమతిచ్చారు. అంతేకాకుండా వారి నెలవారీ భత్యాన్ని రూ.17 నుంచి రూ.250కు పెంచారు.

Updated Date - Oct 26 , 2026 | 12:22 AM