పనులు పరిశీలించిన కేంద్ర బృందం
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:13 AM
మండలంలోని ఉపాధి హామీ నిధులతో చేపట్టిన జల సంరక్షణ పనులను మంగళవారం జలశక్తి, జల భగీరథ, జేఎస్‌జేబీ 2.0 కేంద్ర బృందం పరిశీలించింది.
వీరఘట్టం, జనవరి6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉపాధి హామీ నిధులతో చేపట్టిన జల సంరక్షణ పనులను మంగళవారం జలశక్తి, జల భగీరథ, జేఎస్‌జేబీ 2.0 కేంద్ర బృందం పరిశీలించింది. తలవరం, తెట్టంగి, కుమ్మరిగుంట, బిటివాడ, వండువ, చిదిమి, పివిఆర్‌పురం, చినగోర, మూల లంక, నడుకూరు, నడిమికెల్ల గ్రామాల్లో పనులను ప్రత్యక్షంగా వారు పరిశీలన చేవారు. బృందంలో సెంట్రల్ నోడల్ అధికారి వి.సుగుణాకరరావు, డీఈవో సంతోష్‌కుమార్, ఏపీడీ బి.శ్రీహరిరావు, పార్వతీపురం ఏపీడీ టి.త్రివిక్రమరావు పాల్గొన్నారు. మండలానికి చెందిన ఏపీవో జి.సత్యంనాయుడు, ఈసీ బి.కృష్ణప్రసాద్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.