ఘనంగా పందిరి రాట
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:43 AM
: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 29న జరగనున్న సీతారాముల తిరుకల్యాణ మహోత్సవానికి సంబంధించి ఆదివారం పందిరి రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- 29న రామతీర్థంలో సీతారాముల కల్యాణం
నెల్లిమర్ల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 29న జరగనున్న సీతారాముల తిరుకల్యాణ మహోత్సవానికి సంబంధించి ఆదివారం పందిరి రాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకొని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయి రామాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం పందిరి రాట కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించింది. ముందుగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తుల వద్ద విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యహవాచనం, విశేష ఆరాధన నిర్వహించారు. తరువాత దేవాలయంలో తూర్పు గోపురం వద్ద పందిరిరాట వేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు ఖండవిల్లి కిరణ్‌కుమార్, గొడవర్తి నరసింహాచార్యులు, సుదర్శనం పవన్‌కుమార్, రామ్‌గోపాల్, దేవస్థానం సిబ్బంది రామారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.