సందడిగా అమ్మవార్ల తీర్థాలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:03 AM
జాకేరు గ్రామంలో పైడమ్మ, చిన్నమ్మపేరంటాలు, వీరాంజనేయస్వామి తీర్థ మహోత్సవాలు సందడిగా జరిగాయి.
ఉత్కంఠగా సంగిడీరాళ్ల పోటీలు, గుర్రపు పందేలు
ఆకట్టుకున్న బండ్ల వేషాలు
వేపాడ, జనవరి 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని జాకేరు గ్రామంలో పైడమ్మ, చిన్నమ్మపేరంటాలు, వీరాంజనేయస్వామి తీర్థ మహోత్సవాలు సందడిగా జరిగాయి. రెండు రోజు సోమవారం ఉత్తరాంధ్ర స్థాయిలో నిర్వ హించిన సంగిడీరాళ్ల పోటీలు ఉత్కంఠగా సాగాయి. మధ్యాహ్నం గుర్రపు పందేలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
బల్లంకి గ్రామంలో మరిడిమాంబ జాతర సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన బండ్ల వేషాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.