The budget of the corporation is Rs.158. 27 crores కార్పొరేషన్ బడ్జెట్ రూ.158. 27కోట్లు
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:22 AM
The budget of the corporation is Rs.158. 27 crores విజయనగరం నగరపాలక సంస్థ 2026-27 వార్షిక బడ్జెట్ రూ.158.27కోట్లకు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన వార్షిక బడ్జెట్ సమావేశంలో ప్రధాన అంశాలను సంబంధిత అధికారులు సభలో ప్రస్తావించారు.
కార్పొరేషన్ బడ్జెట్ రూ.158. 27కోట్లు
ఏకగ్రీవంగా ఆమోదించిన పాలకవర్గం
విజయనగరం టౌన్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి):
విజయనగరం నగరపాలక సంస్థ 2026-27 వార్షిక బడ్జెట్ రూ.158.27కోట్లకు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన వార్షిక బడ్జెట్ సమావేశంలో ప్రధాన అంశాలను సంబంధిత అధికారులు సభలో ప్రస్తావించారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు కార్పొరేటర్లు ప్రకటించారు.
కేటాయింపులు ఇలా..
రూ.69.77కోట్లతో నగరాభివృద్ధి పనులు, నూతన రహదారులకు రూ.7.50కోట్లు కేటాయించారు. బీపీఎస్ నిధులతో నూతన రహదారుల ఏర్పాటుకు రూ.2.50కోట్లు, పలు అభివృద్ధి పనులకు రూ.12కోట్లు,
రూ.కోటితో సచివాలయాలకు పక్కా భవనాల నిర్మాణం, రూ.కోటితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణం, రూ.కోటితో పట్టణ సుందరీకరణ పనులు, రూ.4కోట్లతో కాలువలు నిర్మాణం, రూ.కోటితో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రూ.కోటితో పార్కుల్లో గ్రిల్స్ ఏర్పాటు, రూ.2కోట్లతో నీటిసరఫరా పైపులైను ఏర్పాటు, రూ.కోటితో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, రూ.కోటితో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, కల్యాణ మండపాలు ఏర్పాటు, రూ.3కోట్లతో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.2కోట్లతో ఆధునిక జంతువధశాల, రూ.2.77కోట్లతో ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టాలని బడ్జెట్‌లో పేర్కొన్నారు.
ఎవరేమన్నారు..
- 39వ డివిజన్ కార్పొరేటర్ ప్రభాకర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం బాగాలేదని నిరాశ వ్యక్తం చేశారు. ప్రజారోగ్యశాఖాధికారి విధుల్లో ఉన్నారా లేక సెలవులపై వెళ్లిపోయారా అన్నట్లు పారిశుధ్యం తీరు ఉందని విమర్శించారు.
- 45వ డిజన్ కార్పొరేటర్ సంతోషికుమారి మాట్లాడుతూ అడిగిన వెంటనే తమ డివిజన్‌లోని ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
- 13వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనువాసరావు మాట్లాడుతూ నగరంలో కుక్కల నివారణపై ప్రత్యేక దృష్టి సారించడం లేదన్నారు.
- 15వ డివిజన్ కార్పొరేటర్ అల్లు చాణక్య మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో కార్పొరేషన్ నిధులతో నగరాభివృద్ధి జరిగిందే తప్పా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి నిధులు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దారుణమన్నారు.
- 6వ డివిజన్ కార్పొరేటర్ ఎస్.విరాజేష్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాధారణ నిధులు రూ.48కోట్లను ఫ్రీజ్ చేసి ఉంచడంపై మండి పడ్డారు.
కాగా బడ్జెట్ సమావేశంలో అల్లుచాణక్య, ఎస్‌వీ రాజేష్, శ్రీనువాసరావు, రేగాన రూపాదేవి,రమాదేవితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులైన కోలగట్ల వీరభద్రస్వామి హయాంలోనే కార్పొరేషన్ అభివృద్ధి చెందిందని, కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.
----------------