Share News

కళింగాంధ్ర ఉద్యమ గీతాలకు పుట్టినిల్లు

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:16 AM

కళింగాంధ్ర ప్రాంతం ఉద్యమ గీతాలకు పుట్టినిల్లు అని సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు అన్నారు.

కళింగాంధ్ర ఉద్యమ గీతాలకు పుట్టినిల్లు
పాటల సంపుటిని ఆవిష్కరిస్తున్న కవులు, సీఐ

బెలగాం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కళింగాంధ్ర ప్రాంతం ఉద్యమ గీతాలకు పుట్టినిల్లు అని సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోని మన్యం కళా వేదికలో పార్వతీపురం అరసం అధ్యక్షుడు సిరికి స్వామినాయుడు అధ్యక్షతన పాటల కార్యశాల నిర్వహించారు. కార్యక్రమానికి రచయితలు, గాయకులు, సాహితీ ప్రేమికుల పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహితీ వేత్త గౌరునాయుడు మాట్లాడుతూ పాట సమాజంలో మార్పు తీసుకువచ్చే శక్తివంతమైన సాహితీ ప్రక్రియ అన్నారు. కొత్త రచయిత లు, గాయకులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో కార్యశాలను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా నల్లి ధర్మారావు రాసిన మౌనమిప్పుడు పగిలిపోని పాటల సంపుటిని గంటేడ గౌరునాయుడు, విశాలాంధ్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.హరినాథ్‌రెడ్డి, పట్టణ సీఐ డాక్టర్‌ బి.వెంకటరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రచయితలు, గాయకులు గరిమెళ్ల సత్యనారాయణ, సుబ్బారావు పాణిగ్రాహి, బద్రి కూర్మారావు, పి.చంద్రనాయక్‌, పెంచలయ్య, జి.ఎస్‌.చలం, వంకల రాజారావు, డప్పు శ్రీను, బద్రి కూర్మారావు, పక్కి రవీంద్రనాధ్‌, పల్ల రోహిణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 12:16 AM