Share News

చెట్టును ఢీకొన్న బైకు

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:33 AM

భోగి పండుగ రోజున బొద్దాం రైల్వే గేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొకరి పరిస్థి తి విషమంగా ఉంది.

చెట్టును ఢీకొన్న బైకు

  • ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

వేపాడ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): భోగి పండుగ రోజున బొద్దాం రైల్వే గేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొకరి పరిస్థి తి విషమంగా ఉంది. వల్లంపూడి ఏఎస్‌ఐ బొబ్బిలి నాగేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నర్సిపిల్లి మెట్ట వద్ద గ్రామానికి చెంది న వలస క్వారీ కార్మికుడు గోపి రామదాసు అనే వ్యక్తి బుధవారం తన బైకుపై తన అన్నయ్య గోపి రామచంద్రతో కలిసి బొద్దాం జంక్షన్‌లో ఉన్న బిర్యానీ సెం టర్‌కు రాత్రి 9.30 గంటల సమయంలో వెళ్లారు. బిర్యానీ కొనుగోలు చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. బొద్దాం రైల్వే గేటు సమీపంలోని కోనేరు వద్ద గల మలుపు వద్ద బైకు అదుపుతప్పి తాటి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో తీవ్ర గాయాల పాలైన రామదాసు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రామచంద్రరావుకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రఘు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 17 , 2026 | 12:33 AM