వసంత నవరాత్రుల ప్రారంభం
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:28 AM
జిల్లాలో సీతారాముల వసంత నవరాత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. సాలూరు పెదకోమటిపేట రామాలయంలో సుప్రభాతసేవ, తోమాలసేవ, నిత్యారాఽ దన, బాలభోగ నివేద, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్టి, డబ్బివీధి రామమందిరం తిరువీధి నిర్వహించారు.
సాలూరు రూరల్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీతారాముల వసంత నవరాత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. సాలూరు పెదకోమటిపేట రామాలయంలో సుప్రభాతసేవ, తోమాలసేవ, నిత్యారాఽ దన, బాలభోగ నివేద, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్టి, డబ్బివీధి రామమందిరం తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ సఖీ బృందం చేసిన నృత్యార్చన ఆకట్టుకున్నది. వెలమపేట రామమందిరం వద్ద సీతారాముల విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటప్రదర్శన ఆకట్టుకున్నది. నెయ్యిలవీధి, మెంటాడవీధి, వేంకటేశ్వర కాలనీ తదితర చోట్ల ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. మామిడిపల్లిలో సీతారాములను ధాన్యం బుట్టల్లో ఉంచి ఊరేగించారు.
ఫగరుగుబిల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తోటపల్లిలోని శ్రీకోదండ రామస్వామి దేవస్థానంలో గురువారం వసంతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం పరిధిలో ఈనెల 27వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు మహోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్, చైర్మన్ ఎం.పకీరునాయుడులు తెలిపారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీరామ సుప్రభాత సేవ, ఆరాధన, మంగళశాసనాలు, విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం, శ్రీరామ, లక్ష్మిమంత్ర జపాలతోపాటు పలు పూజలను ఆలయ ప్రధాన అర్చకులు వీవీ అప్పలా చార్యులు నిర్వహించారు. ఈనెల 27న శ్రీరామ నవమిని పురస్కరించుకుని దేవస్థానం ఆవరణలో సీతారామస్వామి వారి కల్యాణ మహోత్సవం అంగ రంగ వైభంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.