Share News

బొబ్బిలికి సిరిమానోత్సవ శోభ

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:19 AM

బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి దాడిత ల్లి-పాతబొబ్బిలి సరేపోలమ్మ జంట సిరిమా నోత్సవాల సందడి ఆదివారం ప్రారంభమైంది.

బొబ్బిలికి సిరిమానోత్సవ శోభ

  • ఘనంగా దేశమ్మతల్లి ఉత్సవాలు

  • రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు

బొబ్బిలి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి దాడిత ల్లి-పాతబొబ్బిలి సరేపోలమ్మ జంట సిరిమా నోత్సవాల సందడి ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు దేశమ్మతల్లి ఉత్సవాలను నిర్వహించారు. పాతబొబ్బిలి దేశమ్మ, సరేపోలమ్మ ఆల యాలతో పాటు గొల్లపల్లి దాడితల్లి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోగల ఆలయాలు రోజంతా భక్తులతో కిటకిట లాడాయి. ఇందిరమ్మ కాలనీలో దేశమ్మతల్లి వారోత్సవా లను ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లిలో దేశతల్లి ఉత్సవాల్లో భాగంగా సాముగరిడీలు, బిందెల డ్యాన్స్‌లు, తప్పెటగుళ్లు ప్రదర్శనలు నిర్వహించారు. పాతబొబ్బిలి లో మేళతాళాలతో ప్రభల ఊరేగింపు నిర్వహించారు. బొబ్బిలి పట్టణంలో పాతబొబ్బిలి, గొల్లపల్లి గ్రామాలలో పలు సంస్థలు ప్రసాద వితరణ, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.

గొల్లపల్లి దాడితల్లి- పాతబొబ్బిలి సరేపోలమ్మ జంట సిరిమానోత్సవాలను పురస్కరించు కుని ఆదివారం రాత్రి స్థానిక రాజా కళాశాల మైదా నంలో బొబ్బిలి మల్టీ టాలెంట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు నిర్వహించారు.. పోటీలను ఎమ్మెల్యే బేబీనాయ న తోపాటు మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి, డీఎస్పీ రాకోటి గోవిందరావు, ఎంపీడీవో రవికుమార్‌ తదితరులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బొబ్బిలిలో ఆధ్యా త్మిక, కళా, సాహితీ, సేవా రంగాలను విశేషంగా ప్రోత్స హిస్తున్నామన్నారు. పోటీల్లో ఏడు జిల్లాల నుంచి 17 టీములు ఈ పాల్గొ నగా.. ఆరు బహుమతులను ప్రక టించారు. మొదటి బహుమతిగా రూ.20,116 ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి టీముకు నగదు పారితోషకాన్ని ప్రోత్సాహంగా అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, కళాభారతి ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:19 AM