Share News

రణభేరిని జయప్రదం చేయాలి

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:25 AM

పీఆర్సీతోపాటు ఇతర ఆర్థిక డిమాం డ్లపై యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టబోయే రణభేరి 2.0 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యూటీఎఫ్‌ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణారావు పిలుపు నిచ్చారు.

 రణభేరిని జయప్రదం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న యూటీఎఫ్‌ నాయకులు:

సీతంపేట రూరల్‌,ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పీఆర్సీతోపాటు ఇతర ఆర్థిక డిమాం డ్లపై యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టబోయే రణభేరి 2.0 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యూటీఎఫ్‌ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణారావు పిలుపు నిచ్చారు. సీతంపేట సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 12వ పీఆర్సీ కమిషన్‌ చైర్మన్‌ను వెంటనే నియ మించాలని కోరారు. 29 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని, హెల్త్‌కార్డు, మెడికల్‌ బిళ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చే శారు. సీపీఎస్‌ రద్దుచేసి మెమో-57ప్రకారం పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారంకోసం ఈనెల 17న విజయవాడలో నిర్వహించనున్న చలోరణభేరికి ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతంచేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో యూటీఎఫ్‌ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కె.ఆనందరావు, బి.పకీరు, ఎ.ప్రకాశం, సింహాద్రి, పి.చ్రందకళ పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 12:25 AM