Share News

బ్యాలెట్‌ బాక్సులు వచ్చేశాయ్‌

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:17 AM

త్వరలో జరగనున్ను మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు పట్టణానికి చేరుకున్నాయి.

బ్యాలెట్‌ బాక్సులు వచ్చేశాయ్‌
బాక్సులను పరిశీలిస్తున్న కమిషనర్‌ రామ్‌గోపాల్‌

పార్వతీపురం టౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్ను మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు పట్టణానికి చేరుకున్నాయి. శనివారం రాత్రి వాటిని పరిశీలించిన స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ బి.రామ్‌గోపాల్‌ ప్రత్యేక గదిలో భద్రపరిచే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ రానున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో 36వార్డుల్లో ఎన్నికలకు అవసరమైన 140 బ్యాలెట్‌ వచ్చాయన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించే విధంగా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:17 AM