ఆశ్రమ పాఠశాలను కొనసాగించాలి
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:03 AM
విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం అడొద్దని, సవరసిద్దమనుగు ఆశ్రమ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి కోరారు.
సీతంపేట రూరల్,జూలై 4(ఆంధ్రజ్యోతి):విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం అడొద్దని, సవరసిద్దమనుగు ఆశ్రమ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి కోరారు. సవర సిద్దమనుగు గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ఈ మేరకు సీతంపేటలోని ఐటీడీఏ కార్యాలయం ప్రవేశద్వారం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వీరికి ఏఎస్‌పీ స్టేట్ ఉపాధ్యక్షుడు వాబయోగి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవరసిద్దమనుగు ఆశ్రమపాఠశాలను మూసివేసి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క పాఠశాలలకు పిల్లలను తరలించాలని ఆదేశాలు జారీచేయడం సరికాదన్నారు. అనంతరం వినతిపత్రాన్ని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్‌కు అందజేశారు.