Share News

నాయకుల అరెస్టులు నిలిపివేయాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:06 AM

రిజన ప్రాంత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పోరాడుతున్న నాయకులపై నిర్బంధం, అరెస్టులు నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నా యుడు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కాద రాము డిమాండ్‌ చేశారు.

  నాయకుల అరెస్టులు నిలిపివేయాలి
నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు:

పాలకొండ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పోరాడుతున్న నాయకులపై నిర్బంధం, అరెస్టులు నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నా యుడు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కాద రాము డిమాండ్‌ చేశారు. గురువారం పాలకొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో కురుపాం నియోజకవర్గంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులను గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో భాస్కరరావు, మణి, సురేష్‌, రఘు పాల్గొన్నారు.

ఫకొమరాడ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): సమస్యలపై పోరాడుతున్న ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేయడం అన్యాయమని సీఐటీయూ నాయకులు కొల్లి సాంబమూర్తి విమర్శిం చారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి వెళ్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం నాయకులు అరెస్టులను ఖండిస్తూ గురువారం కొమరాడలో గిరిజన సంఘం నాయకులు వెంకటేష్‌ రైతు సంఘం నాయకులు దుర్గమ్మ నిరసన తెలిపారు.

Updated Date - Jul 10 , 2026 | 12:06 AM