The arrangements should be impressive. ఏర్పాట్లు భేష్ అనిపించాలి
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:20 AM
The arrangements should be impressive. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని పర్యటన ఏర్పాటల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని ప్రధాని పర్యటన నోడల్ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ప్రధాని పర్యటన ప్రత్యేక అధికారి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండ్యన్‌లు అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్లు భేష్ అనిపించాలి
ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు కృష్ణబాబు, వీరపాండ్యన్
భోగాపురం, జూలై23(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని పర్యటన ఏర్పాటల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని ప్రధాని పర్యటన నోడల్ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ప్రధాని పర్యటన ప్రత్యేక అధికారి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండ్యన్‌లు అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాన్ని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డితో కలిసి గురువారం సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. విమానశ్రయంలో టెర్మినల్‌ను పరిశీలించారు. అరైవల్, డిపార్చర్, చెక్ ఇన్ కౌంటర్లు, భద్రతా తనిఖీ కేంద్రాలు, వీఐపీ లాంజ్, ప్రయాణికులు వేచి ఉండే గదులు, బోర్డింగ్ ప్రాంతాలు, విమానాల ల్యాండింగ్ సదుపాయాలు, అంతర్గత రాకపోకల ఏర్పాట్లను పరిశీలించారు. ప్రొటోకాల్, భద్రతా ప్రమాణాలు, స్వాగత ఏర్పాట్లపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బహిరంగ సభా ప్రాంగణ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో పొరపాట్లకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వారి వెంట ఎయిర్‌పోర్టు కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, పురపాలక శాఖ కమిషనర్ డా.పి.సంపత్‌కుమార్, విజయనగరం, అనకాపల్లి జెసీలు సేతుమాదవన్, సౌర్యమాన్ పటేల్, జీసీసీ ఎండి శోభిత, అదనపు ఎస్పీ సౌమ్యలత, జీఎంఆర్ ప్రతినిధులు ఉన్నారు.
- ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ ఐ.పృథ్విరాజ్, ఎండీ టి.వి.సూర్యప్రకాశ్ కూడా గురువారం ఎయిర్‌పోర్టును సందర్శించి పరిశీలించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా ఎయిర్‌పోర్టును గురువారం సందర్శించి ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించారు.