స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:35 AM
రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించడం ఖాయమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు.
బొబ్బిలి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి: రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించడం ఖాయమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిరడ అప్పలస్వామి సొంత నిధులతో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం 18 వారాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆమె స్ధానిక ఎమ్మెల్యే బేబీనాయనతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు శభాష్ అని మెచ్చుకుంటుంటే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. వైసీపీ గ్రాఫ్ పడి పోయిందన్నారు. ఉనికిని చాటుకోవడానికి నిరాధార ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు. జనసేన నాయకులు, శ్రేణులకు ఆత్మగౌరవం కల్పిస్తూనే కూటమి ధర్మాన్ని పాటిస్తామని చెప్పారన్నారు. ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ జనసేన నేత గిరడను అభినందించారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెకర్ లంక రమేశ్, బీజేపీ నాయకుడు వేమకోటి గిరిబాబు పాల్గొన్నారు.