రైతు సంక్షేమమే కూటమి లక్ష్యం
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:16 AM
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు.
జియ్యమ్మవలస, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు. శుక్రవారం చినమేరంగిలో తహసీల్దార్ సాయి కామేశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఆమె రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు పండించే పంట సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడమే కాకుండా, డబ్బులు కూడా సకాలంలో రైతు ఖాతాల్లో జమ అయ్యేవి కావన్నారు. పట్టా దారు పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటో వేయించడంతో భూముల క్రయ విక్రయాలకు అవరోధం ఏర్పడేదన్నారు. ఇప్పుడ రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇస్తున్నామన్నారు. అనంతరం టీఎన్ వలస గ్రామ దళితుల శ్మశానానికి వెళ్లే తోవ వివాదం, చినమేరంగిపాఠశాల వేరేచోటకు మార్పు, చెరువు సమస్య, దళితవాడలో అసం పూర్తిగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితరత సమస్యలను వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి విజయ నగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొం కాడ రామకృష్ణ, అరకు పార్లమెంట్ నియోజ బకవర్గ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణ రావు, అప్పలకొండ, టీడీపీ మండల అధ్యక్షుడు జోగి భుజంగరావు, డీటీ శివయ్య పాల్గొన్నారు.