Share News

రాష్ట్రంలో మళ్లీ కూటమిదే అధికారం

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:20 AM

రాష్ట్రంలో మళ్లీ కూటమి ప్రభుత్వానికి అధికారం రావడం ఖాయమని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.

రాష్ట్రంలో మళ్లీ కూటమిదే అధికారం
టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే కళావెంకటరావు

ఎమ్మెల్యే కళావెంకటరావు

గరివిడి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ కూటమి ప్రభుత్వానికి అధికారం రావడం ఖాయమని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. కొండదాడి పంచాయతీలో పచ్చమట్ల సాయిరాజు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో బుధవారం రాత్రి చేరాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళా వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే... అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చూసి వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్థానిక ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. కొత్తగా పార్టీలో చేరినవారిని కలుపుకొని పాత నాయకులు వెళుతుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు వెంపడాపు రమణమూర్తి, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:20 AM