Share News

The alliance holds the upper hand in the second phase as well. రెండోవిడతలోనూ.. కూటమిదే పైచేయి

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:40 AM

The alliance holds the upper hand in the second phase as well. రెండో విడత పంచాయతీల్లోనూ కూటమిదే పైచేయి అయింది. ఎక్కువ పంచాయతీల్లో కూటమి పార్టీల మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. వార్డు మెంబర్లలోనూ వారే అధికం. ఇదే సమయంలో పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా అల్లరులు లేకపోవడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

The alliance holds the upper hand in the second phase as well. రెండోవిడతలోనూ.. కూటమిదే పైచేయి

రెండోవిడతలోనూ.. కూటమిదే పైచేయి

అత్యధిక మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నిక

రికార్డు స్థాయిలో 85.78 శాతం ఓటింగ్‌ నమోదు

బొండపల్లి మండలంలో అత్యధికం

మహిళల్లో పోటెత్తిన ఉత్సాహం

విజయనగరం/ కలెక్టరేట్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రెండో విడత పంచాయతీల్లోనూ కూటమిదే పైచేయి అయింది. ఎక్కువ పంచాయతీల్లో కూటమి పార్టీల మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. వార్డు మెంబర్లలోనూ వారే అధికం. ఇదే సమయంలో పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా అల్లరులు లేకపోవడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. గజపతినగరం, రాజాం నియోజకవర్గంతో పాటు జామి, మెంటాడ మండలాల పరిధిలో 246 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. రెండో దశకు సంబంధించి 62 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవన్నీ టీడీపీ కూటమి మద్దతు ఖాతాలో పడడం విశేషం. మరోవైపు అన్ని మండలాల్లో టీడీపీ కూటమి హవా స్పష్టంగా కనిపించింది. మెజార్టీ పంచాయతీలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అలాగే 2,654 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 858 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగతా వాటికి ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌ శాతం రికార్డు స్థాయిలో (85.78 శాతం)నమోదైంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుదీరారు. మొత్తం 3,69,251 మంది ఓటర్లకుగాను 3,16,756 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు పురుషుల కంటే అధికంగా ఓట్లు వేయడం విశేషం. 1,60,237 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులకు సంబంధించి 1,56,517 మంది మాత్రమే ఓటు వేశారు.

ఫ బొండపల్లిలో రికార్డుస్థాయిలో 95.05 శాతం ఓటింగ్‌ నమోదైంది. గంట్యాడలో 87.95, దత్తిరాజేరులో 87.58, గజపతినగరంలో 87.22, జామిలో 86.27, రేగిడిలో 85.81, మెంటాడలో 85.42, రాజాంలో 83.53, వంగరలో 80.11, సంతకవిటిలో 79.63 శాతం ఓటింగ్‌ నమోదుకావడం విశేషం. మరోవైపు రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. పోలింగ్‌ సరళిని వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, జేసీ సేతుమాధవన్‌, డీఆర్వో సత్తిబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

--------------------

గంటల వారీగా పోలింగ్‌ శాతం

మండలాలు పంచాయతీలు 9 గంటలకు 11 గంటలకు 1 గంట చివరి

బొండపల్లి 24 14.15 66.65 93.35 95.05

దత్తిరాజేరు 27 24.50 57.43 80.55 87.58

గజపతినగరం 21 21.09 66.02 85.06 87.22

గంట్యాడ 27 17.67 70.72 89.50 87.95

జామి 25 21.08 64.47 82.83 86.27

మెంటాడ 20 12.07 62.30 82.02 85.42

రాజాం 13 18.85 59.63 79.90 83.53

రేగిడి 33 20.09 63.30 84.60 85.81

సంతకవిటి 28 10.36 52.53 74.79 79.63

వంగర 22 18.39 60.34 80.20 80.11

Updated Date - Nov 30 , 2026 | 12:40 AM