Share News

ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్రకు ఎంతో ప్రయోజనం

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:22 AM

భోగాపు రం విమానాశ్రయం ప్రారంభో త్సవం విజయవంతం అయ్యిం దని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు తెలిపారు.

ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్రకు ఎంతో ప్రయోజనం

  • విజయనగరం ఎమ్మెల్యే అదితి

విజయనగరం రూరల్‌, ఆగస్టు 2(ఆంరఽధజ్యోతి): భోగాపు రం విమానాశ్రయం ప్రారంభో త్సవం విజయవంతం అయ్యిం దని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు తెలిపారు. ఈసందర్భం గా ఆమె ఆదివారం విజయ నగరంలోని తన క్యాంపు కార్యాల యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. జిల్లా అధికారులు, పోలీసులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఈ ఎయిర్‌పోర్టు వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. విమానాశ్రయానికి సంబంధించి భోగాపురం అని కాకుండా, విశాఖ అని రాసి ఉండడాన్ని ఒక విలేకరి ప్రశ్నించగా, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గంటా రవి, పీతల కోదండరామ్‌, పాసి అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:22 AM