భూహక్కులు కల్పించడమే ధ్యేయం: కోళ్ల
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:26 AM
భూ వివాదాలు లేకుండా స్పష్ట మైన హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎస్.కో ట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
వేపాడ, జనవ రి9(ఆంధ్రజ్యోతి): భూ వివాదాలు లేకుండా స్పష్ట మైన హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎస్.కో ట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. శుక్ర వారం వేపాడలో తహ సీల్దార్ రాములమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీభూమి-మీ హక్కు కార్యక్రమంలో రీసర్వే పూర్తయిన జమ్మాదేవిపేట, నీలకంఠరా జపురం, రాయుడుపేట, భానాది, చామలాపల్లి రైతులకు పట్టాదారు పాసుపు స్తకాలు పంపిణీచేశారు.కార్యక్రమంలో ఎంపీడీవో సీహెచ్ సూ ర్యనారాయణ, జడ్పీటీసీ ఎస్.అప్పారావు, గుమ్మడి భారతి పాల్గొన్నారు.
ప్రజలతో ధర్నాలో పాల్గొంటా...
సంక్రాంతి తర్వాత సోంపురం-ఆనందపురం రహదారి అభివృద్ధి పను లు ప్రారంభించకపోతే ప్రజలు చేపట్టే ధర్నాలో తాను కూడా పాల్గొం టానని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. తహసీల్దార్ కార్యా లయంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసేందుకు శుక్రవారం వేపాడ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. దీంతో స్పం దించిన ఎమ్మెల్యే ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడారు. కలెక్టర్‌తో పోన్‌లో మాట్లాడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరిం చారు. రోడ్లు భవనాలశాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. మీరు చెప్పినా కాంటాక్టర్ రోడ్డు పనులు ప్రారంభించకపోతే టెండర్‌ను రద్దు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. దీంతో సంతృప్తి చెందని స్థానికులు పండగ తరువాత రోడ్డు పనులు ప్రారంభించకుంటే ఆందోళన చేయక తప్పదని హెచ్చరించారు. అనంతరం ఏపీ దళిత కూలీ రైతు సంఘం మండల కార్యదర్శి దేబారికి కిరణ్, బంగారయ్య ,రైతు నాయ కుడు ఉల్లింగి అప్పారావు, పలువురు ఆటో డ్రైవర్లు, నిరసన కారులు ఎమ్మెల్యేకి వినతపత్రం అందజేశారు.